కీవ్ ఎయిర్‌పోర్టులో 20 మంది భార‌తీయ విద్యార్థుల అవ‌స్థ‌లు.. కేంద్రవిదేశాంగ మంత్రికి బండి సంజ‌య్ లేఖ‌

ర‌ష్యా ఉక్రెయిన్ మ‌ధ్య యుద్ధం జ‌రుగుతున్న నేప‌థ్యంలో స్వ‌దేశానికి వ‌చ్చేందుకు సిద్ధ‌మైన భార‌తీయ విద్యార్థులు ఉక్రెయిన్ కీవ్ ఎయిర్‌పోర్టులో చిక్కుకుపోయారు. విద్యార్థుల అవ‌స్థ‌లు ప‌డుతున్నారంటూ వారి కుటుంబ స‌భ్యుల ద్వారా బిజెపి రాష్ట్ర అధ్య‌క్షుడు బండి సంజ‌య్ తెలుసుకున్నారు. ఈమేర‌కు వారిని వెంట‌నే భార‌త్‌కు ర‌ప్పించేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోరుతూ విదేశీ వ్య‌వ‌హారాల మంత్రి జై శంక‌ర్‌కు లేఖ రాశారు.

రాష్యా-ఉక్రెయిన్ మ‌ద్య యుద్ధం కార‌ణంగా విదేశీయులంతా దేశాన్ని వ‌డిచి వెళ్లాల‌ని ఉక్రెయిన్ ప్ర‌భుత్వం ఆదేశాల మేర‌కు భార‌తీయులంతా స్వ‌దేశానికి రావ‌డానికి ఏర్పాట్లు చేసుకున్నారు. ఇంత‌లో అక్క‌డి ప్ర‌భుత్వం గ‌గ‌నత‌ల ఆంక్ష‌ల‌ను విధించింది. దీంతో విమానాశ్ర‌యానికి చేరుకున్న వారు అక్క‌డే ఉండిపోవ‌ల్సి వ‌చ్చింది.
విమానాశ్ర‌యంలో ఉన్న 20 మంది విద్యార్థులు అటు యూనివ‌ర్సిటీకి వెళ్ల‌లేక .. భార‌త్‌కు రాలేక విమానాశ్ర‌యంలోనే చిక్కుకుపోయారు. వీరిలో తెలంగాణకు చెందిన విద్యార్థులు క‌డారి సుమాంజ‌లి, ర‌మ్య‌శ్రీ‌, ఎన్‌. శ్రీ‌నిధి, లిఖిత ఉన్నారు.

ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భార‌తీయులు..

Leave A Reply

Your email address will not be published.