భ‌ద్రాద్రి జిల్లాలో పెద్ద‌వాగు గేట్లు ఎత్తివేత‌.. వ‌ర‌ద‌లో చిక్కుకున్న‌ 20 మంది కూలీలు

భ‌ద్రాద్రి (CLiC2NEWS):  భ‌ద్రాద్రి జిల్లా అశ్వారావుపేట ప‌రిధిలోని  పెద్ద‌వాగు ప్రాజెక్టుకు భారీగా వ‌ద‌ర‌నీరు చేరింది. దీంతో అధికారులు గురువారం గేట్లు ఎత్తివేశారు.  ప్రాజెక్టు దిగువ భాగంలో ఒక్క‌సారిగా నీటి ప్ర‌వాహం పెరిగిపోయింది.  కొత్త‌గూడెంలోని నారాయ‌ణ‌పురం వ‌ద్ద నీటి ప్ర‌వాహంలో 20 మంది కూలీలు చిక్కుకుపోయారు. స‌హాయం కోసం ఎదురుచూస్తున్నారు. బాధితుల‌ను ర‌క్షించేందుకు స‌హాయ‌క బృందాలు పంపిచాల‌ని మంత్రి తుమ్మ‌ల నాగేశ్వ‌రావు అధికారుల‌ను ఆదేశించారు.

ఇటీవ‌ల రాష్ట్రంలో కురుస్తున్న వ‌ర్షాల‌కు చెరువులు, వాగులు వ‌ర‌ద నీటితో నిండిపోతున్నాయి. వ‌ర‌ద నీటి ప్ర‌వాహానికి కొన్ని చోట్ల రోడ్డు కూడా కొట్టుకుపోతున్నాయి. ఈ క్ర‌మంలో పెద్ద‌వాగు ప్రాజెక్టుకు భారీగా వ‌ర‌ద నీరు చేరుకుంది.

Leave A Reply

Your email address will not be published.