తిరుమ‌ల‌కు 20 ప్ర‌త్యేక రైళ్లు..

తిరుమ‌ల (CLiC2NEWS): తిరుప‌తి వెళ్లాల‌నుకునే భ‌క్తుల‌కు రైల్యేశాఖ శుభ‌వార్త‌నందించింది. తెలుగు రాష్ట్రాల‌తో పాటు దేశంలోని ఇత‌ర ప్రాంతాల నుండి రైల్వే శాఖ తిరుమ‌ల‌కు ప్ర‌త్యేక రైళ్ల‌ను న‌డుపుతోంది. ఈ మేర‌కు ద‌క్షిణ మ‌ధ్య రైల్వే 20 ప్ర‌త్యేక రైళ్ల‌ను న‌డ‌ప‌నున్న‌ట్లు ప్ర‌క‌టించింది. నేటి నుండి హైద‌రాబాద్‌-తిరుప‌తి, తిరుప‌తి-హైద‌రాబాద్‌, తిరుప‌తి-కాకినాడ‌టౌన్‌, కాకినాడ‌టౌన్‌-తిరుప‌తి మ‌ధ్య ప్ర‌త్యేక రైళ్ల‌ను న‌డ‌ప‌నున్నారు.

తిరుప‌తి-హైద‌రాబాద్ మ‌ధ్య మొత్తం 10 ప్ర‌త్యేక స‌ర్వీసులు న‌డ‌ప‌నుండ‌గా.. ఇవి సికింద్రాబాద్‌, న‌ల్గొండ‌, మిర్యాల‌గూడ‌, నడికుడి, స‌త్తెన‌ప‌ల్లి, గుంటూరు, తెనాలి, బాప‌ట్ల‌, చీరాల‌, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట రైల్వేస్టేష‌న్‌ల‌లో ఆగ‌నున్నాయి.

తిరుప‌తి-కాకినాడ టౌన్ మ‌ధ్య 10 ప్ర‌త్యేక స‌ర్వీసులు న‌డిపేందుకు నిర్ణ‌యం తీసుకున్నారు. ఇవి రేణిగుంట‌, గూడూరు, నెల్లూరు, ఒంగోలు, విజ‌య‌వాడ, ఏలూరు, తాడేప‌ల్లిగూడెం, నిడ‌ద‌వోలు, రాజ‌మండ్రి, సామ‌ర్ల‌కోట రైల్వే స్టేష‌న్‌ల‌లో ఆగ‌నున్నాయి

కాచిగూడ‌-తిరుప‌తి మ‌ధ్య రెండు వేస‌వి ప్ర‌త్యేక రైళ్లను న‌డ‌ప‌నున్నారు. ఈ ప్ర‌త్యేక రైలు జూన్ 1,2 వ‌తేదీన న‌డిపిస్తున్నారు. ఈ ప్ర‌త్యేక రైళ్లు.. ఉందాన‌గ‌ర్‌, షాద్‌న‌గ‌ర్‌, జ‌డ్చ‌ర్ల‌, మ‌హ‌బూబ్‌న‌గ‌ర్‌, వ‌న‌ప‌ర్తి రోడ్‌, గ‌ద్వాల్‌, క‌ర్నూల్‌సిటీ, డోన్ గుత్తి, తాడిప‌త్రి, ఎర్ర‌గుంట్ల, క‌డ‌ప‌, రాజంపేట్‌, రేణిగుంట రైల్వే స్టేష‌న్లో ఆగుతాయి.

Leave A Reply

Your email address will not be published.