ఇ-డ్రైవ్ ప‌థ‌కం: త్వ‌ర‌లో హైద‌రాబాద్‌కు 2వేల ఎల‌క్ట్రిక్ బ‌స్సులు

ఢిల్లీ (CLiC2NEWS): త్వ‌ర‌లో హైద‌రాబాద్ న‌గ‌రానికి 2వేల ఎల‌క్ట్రిక్ బ‌స్సులు రానున్నాయి. ప్ర‌ధాన మంత్రి ఇ-డ్రైవ్ ప‌థ‌కం కింద రాష్ట్రాల‌కు ఎల‌క్ట్రిక్ బ‌స్సుల కేటాయింపుపై కేంద్ర మంత్రి కుమార‌స్వామి గురువారం ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. ఈ ప‌థ‌కం కింద 11 వేల బ‌స్సులు మంజూరు చేయాల‌ని నిర్ణ‌యించారు. ఈ బ‌స్సుల‌ను 5 న‌గ‌రాల‌కు కేటాయించ‌నున్నారు. ఈ క్ర‌మంలో హైద‌రాబాద్ న‌గ‌రానికి 2వేల ఎల‌క్ట్రిక్ బ‌స్సులు రానున్నాయి. బెంగ‌ళూరుకు 4,500.. ఢిల్లీకి 2,800, అహ్మాదాబాద్‌కు 1000, సూర‌త్‌కు 600 బ‌స్సులు కేటాయించిన‌ట్లు స‌మాచారం. పిఎం ఇ-డ్రైవ్ ప‌థ‌కం కింద ఎల‌క్ట్రిక్ బ‌స్సుల కోసం కేంద్ర రూ.10,900 కోట్లు కేటాయించిన‌ట్లు మంత్రి వెల్ల‌డించారు.

Leave A Reply

Your email address will not be published.