రూ. 2వేల నోట్ల మార్పిడి.. గడువు తేదీ పొడిగింపు..
![](https://clic2news.com/wp-content/uploads/2023/05/RBI-DECISION.jpg)
ముంబయి (CLiC2NEWS): దేశ ప్రజలకు ఆర్బిఐ గుడ్న్యూస్ తెలిపింది. రూ. 2వేల నోట్లు బ్యాంకులలో డిపిజిట్ చేయడానికి చివరి తేదీ సెప్టెంబర్ 30గా నిర్ణయించిన విషయం తెలిసిందే. అయితే తాజాగా గడువు ఈ తేదీని పొడగిస్తూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శనివారం వెల్లడించింది. ఇంకా అప్పటివరకు నోట్లు చట్టబద్ధంగా చలామణిలో ఉంటాయని తెలిపింది.
ఈ ఏడాది మే 19వ తేదీన రూ. 2వేల నోట్ల చెలామణి ఉపసంహరించుకున్నట్లు.. వాటిని సెప్టెంబర్ 30లోగా బ్యాంకుల్లో డిపాజిట్ చేయాలని సూచించింది. గడువు తేదీ ముగియనున్న నేపథ్యంలో అక్టోబర్ 7 వరకు పొడిగించినట్లు ఆర్బిఐ ప్రకటనలో పేర్కొంది. అక్టోబర్ 8 తరువాత ఈ రూ. 2వేల నోట్లని 19 RBI ఇష్యూ కార్యాలయాల్లో ఒకేసారి రూ. 20,000 వరకు మార్చుకొనే అవకాశం ఇచ్చింది. వ్యక్తులు కాని, సంస్థలు కాని 19 RBI ఇష్యూ కార్యాలయాల్లో ఈ నోట్లను దేశంలోని తమ ఖాతాలకు ఎంత మొత్తాన్నైనా జమ చేయవచ్చు.