ఎన్నికల్లో ఓడితే అమెరికా వీడతానన్న ట్రంప్!
వాషింగ్టన్ (CLiC2NEWS): ఎన్నికల్లో ఓడిపోతే దేశాన్ని వీడతానని అమెరికా మాజి అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టి అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ అన్నారు. ఆయనను ప్రముఖ బిలియనీర్ ఎలాన్ మస్క్ ప్రత్యేకంగా ఇంటర్వ్యూ చేశారు. అగ్రరాజ్యంలో ఈ ఏడాది నవంబరులో అధ్యక్ష ఎన్నికలు జరుగనున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మస్క్‌తో ట్రంప్ ఇంటర్వూలో ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
జరగబోయే ఎన్నికల్లో ఓడిపోతే .. మనం మళ్లీ వెనెజువెలాలో కలుద్దాం. మన భేటీకి అమెరికా కంటే సురక్షితమైన ప్రదేశం అదే అన్నారు. అందుకే నేను అక్కడికి వెళ్లిపోతా. మీరూ రండి, మనం డిన్నర్ చేద్దామని మస్క్‌కు చెప్పారు. వెనెజువెలా లో ప్రమాదకరమైన నేరస్థులను కూడా జైళ్ల నుండి విడుదల చేసి అమెరికాకు అక్రమంగా వలస పంపిస్తున్నారని ట్రంప్ ఆరోపించారు. అందుకే అక్కడ నేరాల రేటు పడిపోయి.. అమెరికాలో నేరాలు విపరీతంగా పెరుగుతున్నాయన్నారు. ఇలాంటి వారిని ఆపడమే తన లక్ష్యమన్నారు ట్రంప్.
వెనుజువెలాలో నికోలస్ మడురో మరోసారి ఎన్నికయ్యారు. మడురో విధానాలను విమర్శించే మస్క్..అతని ప్రత్యర్థికి మద్దతు నివ్వడం జరిగింది. దీంతో మడురో అధ్యక్షుడగా ఎన్నికైన అనంతరం 10 రోజుల పాటు వెనెజువెలాలో ఎక్స్‌పై నిషేధం విధించారు.