సెంట్ర‌ల్ రోడ్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌లో 209 పోస్టులు

CRRI: సెంట్ర‌ల్ రోడ్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (సిఆర్ఆర్ఐ), న్యూఢిల్లీలో 209 జూనియ‌ర్ సెక్ర‌టేరియ‌ట్ అసిస్టెంట్, జూనియ‌ర్ స్టోనోగ్రాఫ‌ర్ పోస్టులను భ‌ర్తీ చేసేందుకు ద‌ర‌ఖాస్తుల‌ను ఆహ్వానిస్తున్నారు. ఆస‌క్తి గ‌ల అభ్య‌ర్థులు ద‌ర‌ఖాస్తుల‌ను ఏప్రిల్ 21వ తేదీ లోపు పంపించాల్సి ఉంది. ద‌ర‌ఖాస్తు ఫీజు రూ.500గా నిర్ణ‌యించారు. ఎస్‌టి/ ఎస్‌సి/ దివ్యాంగులు / మాజి సైనికోద్యోగులు / మ‌హిళ‌ల‌కు ఫీజు లేదు.

జూనియ‌ర్ సెక్ర‌టేరియ‌ట్ అసిస్టెంట్ (జ‌న‌ర‌ల్‌/ ఎఫ్ అండ్ ఎ/ ఎస్అండ్‌పి) పోస్టులు 177 .. అభ్య‌ర్థుల వ‌య‌స్సు 28 సంవ‌త్స‌రాలు ఉండాలి.

జూనియ‌ర్ స్టెనో గ్రాఫ‌ర్ పోస్టులు 32
ఈ ఉద్యోగాల‌కు 27 సంవ‌త్స‌రాల లోపు ఉన్న అభ్య‌ర్థులు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు.

పైన పేర్కొన్న పోస్టుల‌కు ఇంట‌ర్మీడియ‌ట్ ఉత్తీర్ణ‌త సాధించాలి. కంప్యూట‌ర్ ప‌రిజ్ఞానం, స్టెనో గ్ర‌ఫీ ప్రావీణ్యం ఉండాలి.

కంప్యూట‌ర్ బేస్డ్ టెస్ట్‌, కంప్యూట‌ర్/ స్టెనోగ్ర‌ఫీ ప్రొఫిషియ‌న్సీ టెస్ట్ ఆధారంగా ఎంపిక జ‌రుగుతుంది.

కంప్యూట‌ర్ బేస్డ్ టెస్ట్‌.. ఇంట‌ర్మీడియ‌ట్ స్ధాయిలో 200 మ‌ల్టిపుల్ ఛాయిస్ విధానంలో ప్ర‌శ్నాప‌త్రం ఉంటుంది. వ్య‌వ‌ధి రెండున్న‌ర గంట‌లు.

పేప‌ర్ 1, 2 ఉంటాయి. పేప‌ర్ -1లో అర్హత సాధిస్తే పేప‌ర్‌-2కు ఎంపిక చేస్తారు. పేప‌ర్‌-1లో మెంట‌ల్ ఎబిలిటి టెస్ట్‌.. 100 ప్ర‌శ్న‌లు ఉంటాయి.

పేప‌ర్ -2లో జ‌న‌ర‌ల్ అవేర్‌నెస్‌లో 50 ప్ర‌శ్న‌లు ఉంటాయి. వీటికి 150 మార్కులు . ఇంగ్లిష్ .. 50 ప్ర‌శ్న‌లు ఉంటాయి. 150 మార్కులు. దీనిలో త‌ప్పు స‌మాధానానికి ఒక మార్కు త‌గ్గిస్తారు. పేప‌ర్‌లో సాధించిన మార్కుల ఆధారంగా తుది ఎంపిక జ‌రుగుతుంది.

కంప్యూట‌ర్ ప్రొఫిషియ‌న్సి టెస్ట్ .. కంప్యూట‌ర్‌పై ఇంగ్లిష్‌పై ఇంగ్లిష్‌లో నిమిషానికి 35 ప‌దాలు లేదా హిందీలో 30 ప‌దాల వేగంతో టైప్ చేయ‌గ‌లిగి ఉండాలి.

జూనియ‌ర్ స్టెనో గ్రాఫ‌ర్ పోస్టు ప్ర‌శ్నాప‌త్రం ఇంగ్లిష్‌, హిందీలో ఉంటుంది. 200 ప్ర‌శ్న‌లు ఉంటాయి. ప్ర‌తి త‌ప్పు స‌మాధానానికి పావు మార్కు త‌గ్గిస్తారు.

ప్రొఫిషియ‌న్సీ టెస్ట్ ఇన్ స్టెనోగ్రాఫ‌ర్ .. ఇంగ్లిష్ లేదా హిందీలో ప‌ది నిమిషాల షార్ట్ హ్యాండ్ డిక్టేష‌న్ ఉంటుంది. ఇంగ్లీష్‌లో 50 నిమిషాలు/ హిందీలో 65 నిమిషాల్లో లాంగ్ హ్యాండ్లో రాయ‌గ‌ల‌గాలి. ఇది అర్హ‌త ప‌రీక్ష మాత్ర‌మే.

ఈ ప‌రీక్ష‌ల‌ను ఢిల్లీ ఎన్‌సిఆర్ ప్రాంతంలోని వివిధ ప‌రీక్ష కేంద్రాల్లో నిర్వ‌హిస్తారు. సిబిటి ప‌రీక్ష మే/ జూన్ నెల‌లో నిర్వ‌హించే అవ‌కాశ‌ముంది.

Leave A Reply

Your email address will not be published.