జమ్మూకశ్మీర్‌లో లోయలోపడిన బస్సు.. 21 మంది మృతి

జమ్ము (CLiC2NEWS): జమ్మూకశ్మీర్‌లో బస్సు లోయలో పడి 21 మంది మృతి చెందారు. 40 మంది గాయపడినట్లు సమాచారం. ఉత్తర్‌ప్రదేశ్‌లోని హథ్రాస్ నుండి ప్రయాణికులతో బస్సు బయల్దేరింది. జమ్ములోని జమ్ము-పూంఛ్ రహదారిపై అఖ్నూర్ ప్రాంతంలో బస్సు అదుపుతప్పి లోయలో పడిపోయింది. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు. క్షతగాత్రులను అఖ్నూర్‌లోని ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం. ఈ ఘటనపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ప్రార్ధిస్తున్నానని సోషల్ మీడియాలో పోస్టు చేశారు.