అమెరికాలో తుఫాను (టోర్నడో) సృష్టించిన బీభత్సం.. 21 మంది మృతి

Tornado: అమెరికాలో తుఫాను (టోర్నడో) కారణంగా 21 మంది ప్రాణాలు కోల్పోయారు. కెంటకీ, మిస్సోరీ రాష్ట్రాల్లో టోర్నడో అనే తుఫాను బీభత్సం సృష్టించింది. కెంటకి, మిస్సోరి రాష్ట్రాల్లో ఆస్తి, ప్రాణ నష్టం సంభవించింది. పలు ప్రాంతాల్లో భవనాలు నేలమట్టమయ్యాయి. ముఖ్యంగా కెంటకీలో 14మంది మిస్సోరీలో ఏడుగురు మృతి చెందారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశమున్నట్లు సమాచారం. అనేక మందికి తీవ్రగాయాలయ్యాయి. దాదాపు లక్ష నివాసాలకు విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నట్లు సమాచారం.