21 నుండి ఇంజనీరింగ్ చివరి విడత కాన్సెలింగ్
![](https://clic2news.com/wp-content/uploads/2021/03/students-750x313.jpg)
హైదరాబాద్ (CLiC2NEWS) : ఇంజనీరింగ్ లో మిగిలిన సీట్ల భర్తీ కోసం తెలంగాణ లో ఈ నెల 21 నుండి చివరి విడత కాన్సిలింగ్ నిర్వచనున్నామని రాష్ట్ర సాంకేతిక విద్యా కమిషనర్ నవీన్ మిట్టల్ తెలిపారు. ఇంతకు ముందు సెర్టిఫికెట్ వెరిఫికేషన్ కు హాజరు కాని అభ్యర్థులు ఈనెల 21న. ఆన్ లైన్ లో ఫీజు చెల్లించి స్లాట్ బుక్ చేసుకోవాలని సూచించారు.
22వ. తేదీన. ధ్రువ పత్రాల పరిశీలన జసరుగుతుందని తెలిపారు. 21 నుండి 23 వరకు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చని..26న. తిది విడత. ఇంజనీరింగ్ సీట్లు కేటాయిస్తామని తెలిపారు. అభ్యర్థులు 26 నుండి 28 వరకు ఆన్లైన్లో ఫీజు చెల్లించి రిపోర్ట్ చేయాలనీ తెలిపారు.