ఇజ్రాయెల్ నుండి స్వదేశానికి 212 మంది భారతీయులు..

ఢిల్లీ (CLiC2NEWS): ఇజ్రాయెల్ లో చిక్కుకున్న భారతీయులలో 212 మంది ఢిల్లీకి చేరుకున్నారు. ఇజ్రాయెల్ – హమాస్ మధ్య పోరుకొనసాగుతున్న నేపథ్యంలో భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చేందుకు కేంద్రప్రభుత్వం ఆపరేషన్ అజయ్‌ను ప్రారంభించింది. దీనిలో భాగంగా శుక్రవారం ఇజ్రాయెల్ నుండి 212 మంది భారత్‌కు చేరుకున్నారు. వీరందరినీ ఢిల్లీ ఎయిర్‌ఫోర్ట్‌లో కేంద్రమంత్రి రాజీవ్ చంద్రశేఖర్ స్వాగంతం పలికారు. ఈ సందర్భంగా ఇజ్రాయెల్‌లో ఎదుర్కొన్న భయానక అనుభవాలను వారు పంచుకున్నారు. అక్కడ సైరన్ల మోత ఇంకా చెవులలో మారుమ్రోగుతూనే ఉందని.. ఆ భయానక పరిస్థితులను వర్ణించలేమన్నారు. తమను క్షేమంగా భారత్‌కు తీసుకొచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు.
ఇజ్రాయెల్‌లో మొత్తం దాదాపుగా 18 వేల మంది భారతీయులున్నారు. వీరిలో కేర్‌టేకర్లు, విద్యార్థులు, ఐటి ఉద్యోగులు, వజ్రాల వ్యాపారులు ఉన్నారు. వీరిలో కేర్‌టేకర్లుగా సుమారు 14 వేల మంది ఉన్నట్లు సమాచారం.