డిఆర్‌డిఒలో 22 జూనియర్ రిసెర్చ్ ఫెలో పోస్టులు

హైదరాబాద్‌లోని డిఫెన్స్ రిసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (డిఆర్‌డిఒ)కి చెందిన రిసెర్చ్ సెంటర్ ఇమారత్.. తాత్కాలిక ప్రాతిపదికన 22 పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేశారు. రిసెర్చ్ అసోసియేట్ పోస్టులు.. 3, జూనియార్ రిసెర్చ్ ఫెలో పోస్టులు 19 ఉన్నాయి.
విభాగాలు ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్, మెకానికల్, కెమికల్, ఫిజిక్స్, మెటలర్జి తదితర విభాగాలు కలవు. దరఖాస్తులను అక్టోబర్ 26 వ తేదీ లోపు పంపించాల్సి ఉంది. ఆఫ్‌లైన్ దరఖాస్తులను హెడ్ హెచ్ ఆర్‌డి, డాక్టర్ ఎపిజె అబ్దుల్ కలాం మిసైల్ కాంప్లెక్స్, రిసెర్చ్ సెంటర్ ఇమారత్ (ఆర్‌సిఐ), విజ్ఞాన కంచ, హైదరాబాద్ , తెలంగాణ చిరునామాకు పంపించలి. అభ్యర్థుల వయస్సు 35 సంవత్సరాలు మించకూడదు.
అభ్యర్థులు పోస్టును అనుసరించి సంబంధిత విభాగాలలో బిఇ/ బిటెక్, ఎంటెక్/ ఎమ్మెస్సి, పిహెచ్‌డితో పాటు పని అనుభవం అవసరం . పూర్తి వివరాలకు https://www.drdo.gov.in/ వెబ్‌సైట్ చూడగలరు.