ఎపి ఎకనమిక్ డెవలప్‌మెంట్ బోర్డులో 22 పోస్టులు

APEDB: ఆంధ్రప్రదేశ్ ఎకనమిక్ డెవలప్‌మెంట్ బోర్డు (APEDB) .. వివిధ టీమ్స్‌లో ఖాళీగా ఉన్న 22 పోస్టులను భర్తీ చేసేందుకు ప్రకటన విడుదల చేసింది. ఈ పోస్టులను ఒప్పంద ప్రాతిపదికన భర్తీ చేయనున్నారు. మొత్తం పోస్టులు 22 . వీటిలో అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్ -5,
జనరల్ మేనేజర్ -10
మేనేజర్ -7
ఇన్వెస్ట్ మెంట్ ప్రమోషన్, ఎక్స్‌టర్నల్ ఎంగేజ్ మెంట్, హెచ్ ఆర్ అండ్ అడ్మిన్ , పాలసి అండ్ లీగల్ , గ్రాఫిక్ డిజైన్ (స్టాటిక్ అండ్ వీడియో)లలో ఖాళీలు ఉన్నాయి.
ఈ పోస్టులకు రాత పరీక్ష, ఇంటర్వ్యూల ఆధారంగా ఎంపిక జరుగుతుంది. ఉద్యోగాలకు ఎంపికైన వారికి నెలకు అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్‌కు వేతనం రూ. 2,50,000- రూ.5,00,000 వరకు ఉంటుంది.
జనరల్ మేనేజర్ పోస్టులకు ఎంపికైన వారికి వేతనం నెలకు రూ. 2లక్షల నండి రూ.2.5 లక్షలు ఉంటుంది. మేనేజర్ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు వేతనం రూ. 1,50,000 నుండి రూ.2 లక్షల వరకు ఉంటుంది.
డిగ్రీ, పిజి, మాస్టర్స్ డిగ్రీతో పాటు పని అనుభవం ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తులను ఆన్‌లైన్లో ఈనెల 20వ తేదీలోపు పంపించాల్సి ఉంది.
పూర్తి వివరాల కోసం అభ్యర్థులు https://apedb.ap.gov.in/career.html వెబ్‌సైట్ చూడగలరు