ఇస్రోలో ప్రభుత్వ ఉద్యోగాలు..
224 టెక్నీషియన్, టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులు

బెంగళూరులోని ఇస్రో, యుఆర్ రావు శాటిలైట్ సెంటర్, ఇస్రో టెలిమెట్రి ట్రాకింగ్ అండ్ కమాండ్ నెట్వర్క్ -224 ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు. మెకట్రానిక్స్, మెటీరియల్ సైన్స్, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, ఎలక్ట్రికల్/ ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, ప్లంబర్, టర్నర్, కార్పెంటర్, వెల్డర్ విభాగాలకు సంబంధించి మొత్తం 224 పోస్టులకు దరఖాస్తులు కోరుతున్నారు.
సైంటిస్ట్ / ఇంజినీర్-ఎస్సి : 05
టెక్నికల్ అసిస్టెంట్ : 55
సైంటిఫిక్ అసిస్టెంట్ : 06
లైబ్రరి అసిస్టెంట్ : 01
టెక్నీషియన్-బి/ డ్రాప్ట్స్‌మ్యాన్-బి : 142
ఫైర్‌మ్యాన్-ఎ : 03
కుక్ : 04
లైట్ వెహికల్ డ్రైవర్ ఎ అండ్ హెవి వెహికల్ డ్రైవర్ ఎ: 08
రాత పరీక్ష / కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. మార్చి 1వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.