తెలంగాణలో కొత్తగా 2,319 కరోనా కేసులు..
జిహెచ్ ఎంసి పరధిలో 1,275 పాజిటివ్ కేసులు

హైదరాబాద్ (CLiC2NEWS): రాష్ట్రంలో కొత్తగా 2వేలకు పైగా కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈమేరకు రాష్ట్ర ఆరోగ్యశాఖ బులిటెన్ విడుదల చేసింది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో మొత్తం 90,021 మందికి కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా.. 2,319 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనాతో ఇద్దరు మృతి చెందారు. దీంతో కరోనాతో మరణించిన వారి సంఖ్య 4,047 కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 18,339 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల వ్యవధిలో 474 మంది ఈవైరస్ నుండి కోలుకున్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక్క రోజులో నమోదయిన కేసుల్లో జిహెచ్ ఎంసి పరధిలో 1,275 పాజిటివ్ కేసులు ఉండటం గమనార్హం.