24 గంటల్లో 46,254 కొవిడ్ కేసులు

న్యూఢిల్లీ: మంగళవారం కరోనా కేసుల సంఖ్య 40 వేల దిగువకు చేరి కాస్త ఊరట కిలిగించినా.. బుధవారం మరోసారి ఆ కేసుల సంఖ్యలోపెరుగుదల కనిపించింది. గడిచిన 24గంటల్లో దేశంలో కొత్తగా 46,254 కొవిడ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వ శాఖ బుధవారం పేర్కొంది. తాజాగా నమోదైన కేసులతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 83,13,877కు చేరింది. మరో 514 మృతి చెందగా.. మృతుల సంఖ్య 1,23,611కు చేరింది. ప్రస్తుతం దేశంలో 5,33,787 యాక్టివ్ కేసులున్నాయని మంత్రిత్వశాఖ తెలిపింది. 24గంటల్లో మహమ్మారి నుంచి 53,357 మంది కోలుకున్నారని.. ఇప్పటి వరకు 76,56,478 మంది కోలుకొని ఇండ్లకు వెళ్లారని మంత్రిత్వ శాఖ వివరించింది. ఇదిలా ఉండగా.. దేశవ్యాప్తంగా మంగళవారం ఒకే రోజు 12,09,609 శాంపిల్స్ పరీక్షించినట్లు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) తెలిపింది. ఇప్పటి వరకు 11,29,98,959 నమూనాలను పరిశీలించినట్లు వివరించింది. నిన్న ఒక్కరోజే దేశవ్యాప్తంగా 12,09,,609 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు.
[…] 24 గంటల్లో 46,254 కొవిడ్ కేసులు […]