24 లక్షల తెలుగు పాఠ్య పుస్తకాలు వెనక్కి..

హైదరాబాద్ (CLiC2NEWS): రాష్ట్రంలో బుధవారం విద్యార్థులకు ఇచ్చిన తెలుగు పుస్తకాలను వెనక్కి తీసుకోవాలపి పాఠశాల విద్యాశాఖ ఆదేశించిన విషయం తెలిసిందే. 24 లక్షల పుస్తకాలలో ముందుమాటలో మాజి సిఎం కెసిఆర్, మాజి మంత్రులు, అధికారుల పేర్లను ముద్రించారు. మార్పులు చేయకుండా రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి (ఎస్‌సిఇఆర్టి) అధికారులు తీవ్ర నిర్లక్ష్యం వహించారని చర్యలు చేపట్టారు. ప్రభుత్వ పాఠ్య పుస్తకాల విభాగం డైరెక్టర్ శ్రీనివాసచారి, ఎస్‌సిఇఆర్‌టి డైరెక్టర్ రాధారెడ్డిపై ప్రభుత్వం చర్యలు చేపట్టింది. వారిని విధుల నుండి తొలగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. పాఠశాల విద్య అదనపు డైరెక్టర్ రమేశ్‌కు ఎస్‌సిఇఆర్‌టి డైరెక్టర్‌గా.. ముద్రణ సేవల విభాగం డైరెక్టర్‌గా టిఆర్ ఇఊఎస్ కార్యదర్శి రమణ కుమారి బాధ్యతుల అప్పగించారు.
తెలంగాణ రాష్ట్రంలోని పాఠశాలలో ఒకటి నుండి పదో తరగతి వరకు విద్యార్థులకు అందజేసిన తెలుగు వాచకంలో ముందుమాలోని తప్పులను గుర్తించిన ఉపాధ్యాయులు విద్యాశాఖ దృష్టికి తీసుకెళ్లారు. ముందుగా ఆపేజిని తొలగించాలనుకున్నారు. దానివలన ఆ పేజి వెనుక ఉన్న జాతీయ గీతం, ప్రతిజ్ఞ కూడా లేకుండా పోతాయని ఆపేశారు. అనంతరం పుస్తకాలను వెనక్కి తీసుకోవాలని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ శ్రీదేవ సేన డిఇఒలను ఆదేశించారు.