ఎపిలో 24 మంది మంత్రుల రాజీనామా..
ఏప్రిల్ 11వ తేదీన కొత్త మంత్రి మండలి ప్రమాణ స్వీకారం

అమరావతి (CLiC2NEWS): ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో 36 అంశాలపై మంత్రివర్గం చర్చించింది. మంత్రి వర్గ సమావేవం ముగిసిన వెంటనే 24 మంది మంత్రులు తమ రాజీనామా లేఖలను సిఎంకు అందజేశారు. మరోవైపు ఏప్రిల్ 11వ తేదీన కొత్త మంత్రి మండలి ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
చివరి కేబినేట్ భేటీ సందర్భంగా.. కొత్తపేట, పులివెందుల రెవెన్యూ డివిజన్లకు ఆంధ్రప్రదేశ్ కేబినేట్ ఆమోదం తెలిపింది. జిల్లాల పునర్వవస్థీకరణ విజయవంతంగా చేసినందుకు ప్రణాళిక శాఖ కార్యదర్శి విజయ్కుమార్కి అభినందనలు తెలుపుతూ కేబినేట్ తీర్మానం చేసింది. ఈసందర్భంగా సిఎం జగన్ సహా మంత్రులు విజయ్కుమార్ని అభినందించారు.