సిఎం, డిప్యూటి సిఎం చిత్రపటాలకు పాలాభిషేకం..
2,400 మంది టిజిఎస్పిడిసిఎల్ ఉద్యోగులకు పదోన్నతి..

హైదరాబాద్ (CLiC2NEWS): రాష్ట్రంలోని ఎస్పిడిసిఎల్ కార్పొరేట్ కార్యాలయంలో ఉద్యోగులు సిఎం రేవంత్ రెడ్డి, డిప్యూటి సిఎం భట్టి విక్రమార్క , ఎస్పిడిసిఎల్ సిఎండి ముషారఫ్ ఫరూఖి చిత్ర పటాలకు పాలాభిషేకం చేశారు. పదోన్నతుల కోసం దశాబ్దకాలంగా ఎదురు చూస్తున్న వారికి ప్రస్తుత సర్కార్ ఒకే సారి 2,400 మందికిపైగా పదోన్నతులు కల్పించింది. దీంతో వారంతా సంతోషంగా చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఇకపై తామంతా మరింత నిబద్ధతతో పనిచేస్తామని , రైతుల మనోభావాలకు అనుగుణంగా ముందుకెళతామని అన్నారు. గత ప్రభుత్వం ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసిన పట్టించుకోలేదని తెలిపారు. ట్రాన్స్కో, జెన్కో ఉద్యోగులకు కూడా పదోన్నతులు కల్పించాలని విజ్ఞప్తి చేశారు.