244 పరుగులకు టీమిండియా ఆలౌట్
అడిలైడ్: ఆస్ట్రేలియాతో జరుగుతున్న టెస్టులో టీం ఇండియా 244 పరుగులకి ఆలౌట్ అయింది. గురువారం 6 వికెట్ల నష్టానికి 233 పరుగులు చేసిన టీమిండియా రెండో రోజు మరో 11 పరుగులు మాత్రమే చేయగలిగింది. అశ్విన్ (15) పరుగులకు ఔట్ కాగా, సాహా(9), ఉమేష్(6), షమీ(0) ఒకరి తర్వాత ఒకరు పెవీలియన్ క్యూ కట్టారు. బుమ్రా 4 పరుగులతో నాటౌట్‌గా నిలిచారు. ఆస్ట్రేలియా బౌలర్స్‌లో స్టార్క్ 4, కమిన్స్ 3 వికెట్స్ తీసారు. హాజిల్ వుడ్, లియాన్‌కు చెరో వికెట్ దక్కాయి. భారత్ ఇన్నింగ్ ఓ దశలో స్ట్రాంగ్‌గా కనిపించిన కోహ్లీ ఔట్ కావడంతో లైనప్ పేకమేడలా కుప్పకూలింది. తొలి రోజు కోహ్లీ, రహానే రాణించడంతో ఓ దశలో 3 వికెట్లకు 188 పరుగుల వద్ద పటిష్టంగా నిలిచిన భారత్ 206కే ఆరు వికెట్లకు చేరింది. రహానే తప్పిదం కారణంగా కోహ్లీ రనౌటవడంతో మ్యాచ్ దశ తిరిగిపోయింది.