ఐఆర్‌సిటిసి సౌత్‌జోన్‌లో 25 అప్రెంటిస్ ఖాళీలు

IRCTC: ఇండియన్ రైల్వే కాటరింగ్ అండ్ టూరిసమ్ కార్పొరేషన్‌లో 25 అప్రెంటిస్ ఖాళీలు ఉన్నాయి. ఐఆర్‌సిటిసి సౌత్‌జోన్‌లో టెక్నీషియన్ అప్రెంటిస్, డిప్లొమా అప్రెంటిస్, అప్రెంటిస్ లేదా డిగ్రీ లలో ఉన్న ఖాళీలను భర్తీ చేసేందుకు దరఖాస్తులు కోరుతున్నారు.
ఆసక్తి గల అభ్యర్థులు ఏప్రిల్ 7వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు 15 నుండి 25 ఏళ్ల మధ్య వయస్సు ఉండాలి. విద్యార్హత , మార్కులు, ధ్రువపత్రాల పరిశీలన ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
50% మార్కులతో మెట్రిక్యూలేషన్, ఐటిఐ, సిఎ, డిగ్రీ ఉత్తీర్ణత ఉండాలి.
ఎంపికైన వారిలో టెక్నీషియన్ అప్రెంటిస్ , డిప్లొమా అభ్యర్థలకు నెలకు రూ.8వేలు స్టైపెండ్ అందుతుంది.
అప్రెంటిస్ లేదా డిగ్రీ అభ్యర్థులకు నెలకు రూ.9వేలు స్టైపెండ్ అందుతుంది.
ఎంపికైన వారు తమిళనాడు, కేరళ, కర్ణాటక ప్రాంతాల్లో పనిచేయవలసి ఉంటుంది.
దరఖాస్తులను అప్రెంటిషిప్ పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఖాళీల వివరాలు
కంప్యూటర్ ఆపరేటింగ్ అండ్ ప్రొగ్రామింగ్ అసిస్టెంట్ -5
ఎగ్జిక్యూటివ్ ప్రొక్యూర్‌మెంట్ -10
మార్కెటింగ్ అసోసియేట్ ట్రైనింగ్ -4
హెచ్ ఆర్ ఎగ్జిక్యూటివ్ అండ్ ఎంప్లాయ్ డేటా మేనేజర్-2
ఎగ్జిక్యూటివ్ హెచ్ ఆర్ -1
సిఎస్ ఆర్ ఎగ్జిక్యూటివ్ -1
ఐటి సపోర్ట్ ఎగ్జిక్యూటివ్-2