60 ఏళ్లు దాటిన వృద్ధులకు ఆర్టీసిలో 25% రాయితీ: మంత్రి పేర్ని నాని

అమరావతి (CLiC2NEWS): కరోనా కారణంగా 60 సంవత్సరాలు పైబడిన వృద్దులకు ఆర్టీసీ నిలిపివేసిన 25% రాయితీని తిరిగి పునరుద్ధరిస్తున్నట్లు మంత్రి పేర్నినాని తెలిపారు. వయసు నిర్థారణకు సంబంధించిన ఏదైనా ప్రూఫ్.. ఆధార్, ఓటరు ఐడీ లాంటి ఏదైనా గుర్తింపు కార్డు చూపించి రాయితీ పొందవచ్చని వెల్లడించారు. ఇతర శాఖల్లో మాదిరిగానే ఆర్టీసీలో కారుణ్య నియామకాలను భర్తీ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి స్పష్టం చేశారు. 1800పైగా కారుణ్య నియామకాలను గ్రామ, వార్డు సచివాలయాలతో పాటు మిగిలిన శాఖల్లో ఉద్యోగాలు ఇవ్వాలని సిఎం ఆదేశించినట్లు తెలిపారు.