హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ లో పోస్టులు..

HAL: హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్ఎఎల్)లో 25 నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి ప్రకటన వెలువడింది. మెకానికల్, ఎలక్ట్రికల్ , ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఎలక్ట్రికల్ వర్క్స్ , స్ట్రక్చర్, గ్రైండర్ తదితర విభాగాల్లో పోస్టులు కలవు. మొత్తం 25 పోస్టులలో డిప్లొమా టెక్నీషియన్ (డి-6) 6 పోస్టులు, ఎయిర్ క్రాప్ట్ టెక్నీషియన్ డి-6 17, ఆపరేటర్ సి-5 2 పోస్టులు కలవు. అభ్యర్థులు పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో కనీసం 60% మార్కులతో ఐటిఐ, ఇంజినీరింగ్ డిప్లొమా తో పాటు పని అనుభవం ఉండాలి. అభ్యర్థుల వయస్సు 28 ఏళ్లకు మించరాదు. ఎస్‌సి, ఎస్‌టిలకు ఐదేళ్లు, ఒబిసిలకు మూడేళ్లు, పిడబ్ల్యూ బిడిలకు పదేళ్ల సడలింపు వర్తిస్తుంది.
ఎంపికైన అభ్యర్థులు బెంగళూరు, జామ్‌నగర్, గోరఖ్ పుర్, అంబలా, భుజ్ ప్రాంతాలలో పనిచేయవలసి ఉంటుంది. నెలకు గ్రూప్-సి పోస్టులకు రూ. 46,796, గ్రూప్-డి అభ్యర్థులకు రూ. 48,764 వేతనం చెల్లిస్తారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తులకు చివరి తేదీ ఆగస్టు 30 గా నిర్ణయించారు. పూర్తి వివరాలకు https://hal-india.co.in/ వెబ్‌సైట్ చూడగలరు.