ఎపిలో 255 కెరియర్, మెంటల్ హెల్త్ కౌన్సెలర్ పోస్టులు
ఆంధ్రప్రదేశ్ జిల్లాల్లో కెరియర్, మెంటల్ హెల్త్ కౌన్సెలర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. నోయిడాలోని ఎడ్యుకేషన్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ (ఎడ్‌సిల్), భారత ప్రభుత్వ ఆధ్యర్యంలోని మిని రత్న కేటగిరీ-ఖి, ఒప్పంద ప్రాతిపదికన ఎపిలోని 26 జిల్లాల్లో ఈ పోస్టులు భర్తీ చేయనుంది. మొత్తం పోస్టులు 255.
ఆసక్తి గల అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరుతున్నారు. అభ్యర్థుల వయస్సు గరిష్టంగా డిసెంబర్ 31, 2024 నాటికి 40 ఏళ్లు మించకూడదు. నెలకు వేతనం రూ.30 వేలు అందుతుంది. దరఖాస్తుకు ఫీజు లేదు. ఆన్‌లైన్‌లోదరఖాస్తులు పంపించాల్సి ఉంది. చివరి తేదీ జనవరి 10, 2025గా నిర్ణయించారు.
కెరియర్, మెంటల్ హెల్త్ కౌన్సెలర్ పోస్టులకు సైకాలజిలో పిజి, బ్యాచిలర్స్ డిగ్రీ, కెరియర్ గైడెన్స్, కౌన్సెలింగ్ డిప్లొమా ఉండాలి. సంబంధిత రంగాల్లో కనీసం 2.5 సంవత్సరాల కౌన్సెలింగ్ అనుభవం అవసరం. తెలుగు భాషలో ప్రావీణ్యం తప్పనిసరిగా ఉండాలి.
పూర్తి వివరాలకు https//www/educilindia.co.in/ వెబ్‌సైట్ చూడగలరు.