ఎపి హైకోర్టు.. లా క్ల‌ర్క్ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్‌

అమ‌రావ‌తి (CLiC2NEWS) : ఆంధ్ర‌ప్ర‌దేశ్ హైకోర్టు కాంట్రాక్ట్ ప్రాతిప‌దిక‌న 26 లా క్ల‌ర్క్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తుల‌ను కోరుతుంది. న్యాయ‌శాస్త్రంలో డిగ్రీ అర్హ‌త క‌లిగిన వారు ఆఫ్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అభ్య‌ర్థుల వ‌య‌స్సు 30 ఏళ్ల‌కు మించ‌రాదు. ద‌ర‌ఖాస్తుల‌ను పంప‌డానికి చివ‌రితేది జులై 22గా నిర్ణ‌యించారు. ద‌ర‌ఖాస్తుల‌ను ది రిజిస్ట్రార్ (రిక్రూట్‌మెంట్‌), హైకోర్టు ఆఫ్ ఎపి, అమ‌రావ‌తి, నేల‌పాడు, గుంటూరు జిల్లా చిరునామాకు పంపించాలి. అభ్య‌ర్థులు పూర్తి వివ‌రాల‌కు https://hc.ap.nic.in/ వెబ్‌సైట్ చూడగ‌ల‌రు.

Leave A Reply

Your email address will not be published.