ప్రయాగ్‌రాజ్ మహా కుంభమేళాకు 26 ప్రత్యేక రైళ్లు
హైదరాబాద్ (CLiC2NEWS): ప్రయాగ్ రాజ్ మహా కుంభమేళాకు తెలుగు రాష్ట్రాల నుండి 26 ప్రత్యేక రైళ్లను నడపనున్నారు. ఈ మేరకు రేల్వేశాఖ ప్రకటనలో పేర్కొంది. ఉత్తర్ ప్రదేశ్‌లో జనవరి 14 నుండి 45 రోజుల పాటు ఈ మహా కుంభ మేళా జరుగుతుంది. ఈ కుంభమేళాలో 45 కోట్ల మంది భక్తులు పాల్గొనే అవకాశం ఉన్నట్టు సమాచారం. ఇప్పటికే ఆ రాష్ట్ర ప్రభుత్వం భక్తుల అవసరాలు, భద్రత కోసం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తుంది. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల నుండి కుంభమేళాకు వెళ్లాలనుకునే భక్తుల కోసం ప్రత్యేక రైలు సర్వీసులను నడపనున్నట్లు ప్రకటించింది.
ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు, విజయవాడ, మచిలీపట్నం, కాకినాడ టౌన్… తెలంగాణలోని మౌలాలి జంక్షన్, వికారాబాద్, సికింద్రాబాద్ స్టేషన్ల నుండి ఈ ప్రత్యేక రైళ్లు వెళ్లనున్నాయి.