తెలంగాణలో 2,606 కొవిడ్ కేసులు నమోదు..
హైదరాబాద్ (CLiC2NEWS): తెలంగాణ రాష్ట్రంలో రెండు వేలుపైన కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 73,156 కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా 2,606 పాజిటివ్ కేసులు వచ్చాయి. హైదరాబాద్ నగరంలో 1,583 కేసులు నమోదయ్యాయి. ఈమేరకు వైద్యారోగ్య శాఖ బులిటెన్ విడుదల చేసింది. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదయిన కొవిడ్ కేసులు 6,92,357కి చేరింది. కరోనా మహమ్మారితో ఇద్దరు మృతి చెందారు. దీంతో ఇప్పటివరకు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 4,041కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 12,180 యాక్టివ్ కేసులున్నాయి.