ముంబయి లోకల్ రైల్వే స్టేషన్లలో 2,729 కెమెరాలు

ముంబయి (CLiC2NEWS): దేశ ఆర్థిక రాజధాని ముంబయిలోని ఒక లోకల్ రైల్వే స్టేషన్లలో భద్రతపై పశ్చిమ రైల్వే దృష్టిసారించింది. ఏకంగా విరార్ నుండి చర్చ్‌గేట్ వరకు ఉన్న 30 లోకల్ రైల్వే స్టేషన్లలో 2,729 సీసీ కెమెరాలను ఏర్పాటు చేసింది. . ఇవి 4కే టెక్నాలజీతో కూడిన ఇంటిగ్రేటెడ్ సర్వైలెన్స్ సిస్టమ్ కెమెరాలని పశ్చిమ రైల్వే సీపీఆర్వో సుమిత్ ఠాకూర్ తెలిపారు. ఈ కెమెరాల ప్రత్యేకత ఏమిటంటే 2,729 కెమెరాలలో 450 కెమెరాలు ముఖ గుర్తింపు సాంకేతికత కలిగి ఉన్నాయని ఆయన చెప్పారు. ఈ నెలాఖరు నాటికి ఈ కొత్త సిస్టమ్ పూర్తిగా అమలులోకి వస్తుందని సుమిత్ ఠాకూర్ తెలిపారు.