దేశంలో కొత్త‌గా 2,745 కేసులు న‌మోదు

న్యూఢిల్లీ (CLiC2NEWS): దేశంలో క‌రోన్యా వ్యాప్తి అదుపులోనే ఉంది. కాగా గ‌డిచిన 24 గంట‌ల వ్య‌వ‌ధిలో 4.55 ల‌క్ష‌ల మందికి కొవిడ్ నిర్ధార‌ణ ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌గా 2,745 మందికి పాజిటివ్‌గా న‌మోదైంది. ఈ మేర‌కు కేంద్ర కుటుంబ, ఆరోగ్య మంత్రిత్వ శాఖ బుధ‌వారం క‌రోనా బులిటెన్ వెల్ల‌డించింది. తాజాగా వైర‌స్ బారిన ప‌డి ఆరుగురు మృతి చెందారు.

గ‌డిచిన 24 గంట‌ల వ్య‌వ‌ధిలో 2,236 మంది క‌రోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు.

ప్ర‌స్తుతం దేశంలో 18,386 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి.
తాజాగా న‌మోదైన కేసుల‌తో క‌లిపి దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 4,31,60,832కి చేరింది. వీటిలో 4,226,17,810 మంది క‌రోనా నుంచి కోలుకున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు దేశంలో 5,24,636 మంది క‌రోనా బారిన ప‌డి ప్రాణాలు కోల్పోయారు.

Leave A Reply

Your email address will not be published.