28 అడుగుల నేతాజీ విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రధాని
![](https://clic2news.com/wp-content/uploads/2022/09/PM-INAUGARATES-NETAJI-STATUE.jpg)
ఢిల్లీ (CLiC2NEWS): దేశ రాజధాని ఢిల్లీలోని ఇండియా గేట్ వద్ద నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆవిష్కరించారు. విజయ్ చౌక్ నుండి ఇండియా గేట్‌వరకు సెంట్రల్‌విస్టా అవెన్యూ ప్రారంభోత్సవంలో ప్రధాని పాల్గొన్నారు. అనంతరం కర్తవ్యపథ్‌ను ప్రారంభించారు. ఈసందర్భంగా మోడీ మాట్లాడుతూ.. నేతాజీ సేవలను భారత ప్రజలకు తరతరాలకు చాటేందుకు ఇండియా గేట్ వద్ద ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. భారత్ నేతాజీ మార్గంలో నడిచి ఉంటే మరింత అభివృద్ధి సాధించేదని.. దురదృష్టవశాత్తు స్వాతంత్య్రానంతరం ఆయనను మరిచారని అన్నారు. గడిచిన ఎనిమిదేళ్లనుండి నేతాజీ ఆశయాలు, కలల సాధన దిశగా అడుగులు వేస్తున్నామని ప్రధాని అన్నారు. మరోవైపు ఇండియా గేట్ నుండి రాష్ట్రపతి భవన్ వరకు ఉండే రాజ్‌పథ్‌ను కర్తవ్యపథ్‌గా నామకరణం చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసినదే.