స్పోర్ట్స్ కోటాలో ఐటి శాఖలో 291 ఉద్యోగాలు..
![](https://clic2news.com/wp-content/uploads/2021/02/jobs-notification-copy-750x313.jpg)
ముంబయి (CLiC2NEWS): ఐటి శాఖలో 291 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ పోస్టులను స్పోర్ట్స్ కోటా అభ్యర్థుల నుండి దరఖాస్తులను కోరుతున్నారు. జనవరి 19వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవచ్చు. క్రీడా రంగంలో అంతర్జాతీయ/ జాతీయ ఇంటర్ యూనివర్సిటి టోర్నమెంట్ తదితర స్థాయిల్లోని పలు క్రీడల్లో ప్రతిభకనబరిచిన వారికే ఈ ఉద్యోగాల భర్తీలో ప్రాధాన్యం ఉంటుంది. మల్లీ టాస్కింగ్ స్టాఫ్ 137, ట్యాక్స్ అసిస్టెంట్ 119, స్టెనోగ్రాఫర్ గ్రేడ్ -11 18, ఇన్స్కెక్టర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ 14, క్యాంటీన్ అటెండర్ 3 పోస్టులు ఉన్నాయి.
అర్హత.. అభ్యర్థులు క్రికెట్, ఆర్చరీ, అథ్లటిక్స్, బ్యాడ్మింటన్, బేస్బాల్, బాస్కెట్బాల్, బాక్సింగ్, చెస్, సైక్లింగ్, పుట్బాల్, హాకీ, కరాటే, టెన్నిస్, రెజ్లింగ్, యోగాసన, ఖొఖొ సహా మొత్త 65 క్రీడాంశాల్లో ఏదైనా దాంట్లో ప్రతిభావంతులై ఉండాలి. వయస్సు 2023 జనవరి 1వ తేదీ నాటికి 18 నుండి 30 ఏళ్ల లోపు ఉండాలి. దరఖాస్తు రుసుం రూ. 200 గా నిర్ణయించారు. ఒకే దరఖాస్తులో అన్ని పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఇన్స్పెక్టర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ , ట్యాక్స్ అసిస్టెంట్ పోస్టులకు డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. వేతనం రూ. 44,900 నుండి 1,42,400 గా ఉంది.