AP Education: హైస్కూళ్ల పరిధిలోకి 3, 4, 5 తరగతులు

ఉపాధ్యాయులు, విద్యార్థుల‌ను 1:20 నిష్ప‌త్తిలో ఉండేలా చ‌ర్యలు

అమ‌రావ‌తి (CLiC2NEWS) : అంధ్ర‌ప్ర‌దేశ్‌ ప్ర‌భుత్వం ప్రాథ‌మిక పాఠ‌శాల‌లోని 3,4,5 త‌ర‌గ‌తుల‌ను హైస్కూళ్ల ప‌రిధిలోకి తేవాల‌ని పాఠ‌శాల విద్యాశాఖ మార్గ‌ద‌ర్శ‌కాలు జారీ చేసింది. ఎపి ప్ర‌భుత్వం చేప‌ట్టిన నూత‌న విద్యావిధానంలో భాగంగా విద్యార్థుల‌లో సామ‌ర్థ్యాల‌ను పెంచేందుకు, వారికి ఉన్న‌త బోద‌న‌ను అందించేందుకు చ‌ర్య‌లు చేప‌ట్టింది. ఒకే ఆవరణలో ఉన్న లేదా 250 మీటర్ల లోపు దూరంలో ఉన్న ప్రైమరీ స్కూళ్ల 3, 4, 5 తరగతులను హైస్కూళ్ల ప్రధానోపాధ్యాయుల పర్యవేక్షణలోకి తీసుకురావాలని ఆదేశించింది. అదే విధంగా 1,2 తర‌గ‌తులకు ప్రైమ‌రీ ఎస్జీటీల‌తో బోధ‌న కొన‌సాగించి, 3,4,5 త‌ర‌గ‌తుల విద్యార్థుల‌కు సీనియ‌ర్ ఎస్జిటిల‌ను వీలుగా స‌ర్దుబాటు చేయాల‌ని నిర్ణ‌యించింది. ప్రాథ‌మిక పాఠ‌శాల‌లో ఉపాధ్యాయులు, విద్యార్థుల‌ను 1:20 నిష్ప‌త్తిలో ఉండేలా చ‌ర్యలు తీసుకోవాల‌ని సూచించింది.

Leave A Reply

Your email address will not be published.