తిరుమలలో అదృశ్యమైన చిన్నారుల ఆచూకీ లభ్యం..

తిరుమల (CLiC2NEWS): తిరుమలలో అదృశ్యమైన ముగ్గురు విద్యార్థులు కామారెడ్డిలో ఆచూకీ లభ్యమైంది. కామరెడ్డి రైల్వేస్టేషన్లో ఆ ముగ్గురు చిన్నారులు ఆచూకీ లభించడంతో పోలీసులు వెంటనే ఎపి పోలీసులకు, తల్లిదండ్రులకు సమాచారం అందించారు. తిరుమల ఆర్బిసి సెంటర్‌కు చెందిన వైభవ్ యోగేశ్, శ్రీవరదన్, చంద్రశేఖర్ అనే విద్యార్థులు బుధవారం అదృశ్యమైన విషయం తెలిసిందే. పాఠశాలకు వెళ్లిన తమ పిల్లలు ఇంటికి తిరిగి రాకపోవడంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇంటికే వచ్చినట్లు పాఠశాల ఉపాధ్యాయులు తెలపడంతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. తిరుమల బస్టాండ్‌లో సిసిటివి పుటేజిల ద్వారా వారు తిరుమల బస్టాండ్‌కు చేరుకున్నట్లు తెలిసింది. అయితే అక్కడినుండి ఎక్కడకు వెళ్లారనే విషయం తెలియలేదు. దీంతో పోలీసులు వెతకడం ప్రారంభించారు. గురువారం చిన్నారులు కామారెడ్డి రైల్వేస్టేషన్లో ఉన్నట్లు తెలిసింది. తల్లిదండ్రులకు సమాచారం అందించినట్లు తెలిపారు.