టిజిఎస్‌ఆర్‌టిసిలో త్వరలో 3వేల ఉద్యోగాల భర్తీ: మంత్రి పొన్నం

కరీంనగర్ (CLiC2NEWS): మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదివారం 33 విద్యుత్ బస్సులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తమ ప్రభుత్వానిది ప్రజాపాలన అని.. ప్రజాపాలన ఏర్పడిన తర్వాత విప్లవాత్మక మార్పులు చేస్తూ ఆర్‌టిసిని దినదినాభివృద్ధి చేస్తున్నామని మంత్రి అన్నారు. ఇప్పటివరకు ఎంతో మంది మహిళలు ఉచిత బస్సు ప్రయాణం చేశారని.. ఆర్‌టిసిలో త్వరలో 3వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామని తెలిపారు. మహిళా శక్తి, మెప్మా ద్వారా ఆర్‌టిసి బస్సులు కొనుగోలు చేస్తామన్నారు. ఉద్యోగులకు పిఆర్‌సి, కారుణ్య నియామకాలపై దృష్టి పెడతామని మంత్రి వెల్లడించారు.