3 నుంచి శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు
తిరుమల (CLiC2NEWS): వచ్చేనెల (మార్చి) 3వ తేదీనుంచి 7 వ తేదీ వరకు శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు నిర్వహించనున్నారు. ఈ మేరకు తిరుమల తిరుపతి దేవస్థానం ఒక ప్రకటనలో తెలిపింది. వచ్చే నెలలో జరిగే ఈ ఉత్సవాల తేదీలను టిటిడి ప్రకటించింది. ఈ వేడుకల్లో రాత్రి 7 గంటల నుంచి ఉదయం 8 గంటల వరకు పుష్కరిణిలో స్వామి, అమ్మవారు భక్తులకు దర్శనమిస్తారని తెలిపారు. తొలిరోజు 3వ తేదీన సీతా లక్ష్మణ ఆంజేయ సమేతంగా శ్రీరామచంద్రమూర్తి అవతారంలో స్వామివారు తెప్పలపై పుష్కరిణిలో విహరించి భక్తులకు కనువిందు చేస్తారు.
మార్చి 4వ తేదీన శ్రీ కృష్ణాస్వామి అవతారంలో మూడు సార్లు భక్తులకు దర్శనమిస్తారు.
5వ తేదీన మలయప్ప స్వామి 3 సార్లు పుష్కరిణిలో విహరించి భక్తులను అనుగ్రహిస్తారు.
6 వ తేదీన ఐదు సార్లు
7వ తేదీన ఏడుసార్లు తెప్పలపై పుష్కరిణిలో విహరించి భక్తులను కటాక్షిస్తారు.
కాగా ఈ తెప్పోత్సవాల కారణంగా 3,4 తేదీల్లో సహస్రదీపాలంకార సేవ, మార్చి 5,6,7 తేదీల్లో బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలను రద్దు చేశారు.
విశేష ఉత్సవాలు.. తేదీలు
- మార్చి 3వ తేదీన కులశేఖరాళ్వార్ వర్ష తిరునక్షత్రం
- మార్చి 3వ తేదీ నుంచి 7 వరకు శ్రీవారి తెప్పోత్సవాలు
- మార్చి 7వ తేదీన కుమారధార తీర్థ ముక్కోటి
- మార్చి 18వ తేదీన శ్రీ అన్నమాచార్య వర్థంతి
- మార్చి 22వ తేదీన శ్రీ శోభకృత్ నామ సంవత్సర ఉగాది
- మార్చి 30వ తేదీన శ్రీరామనవమి ఆస్థానం
- మార్చి 31వ తేదీన శ్రీరామ పట్టాభిషేకం