TS: ఆశా వ‌ర్క‌ర్ల‌కు 30% ఇన్సెంటివ్ పెంపు..

హైద‌రాబాద్‌ (CLiC2NEWS): తెలంగాణ ప్ర‌భుత్వం ఆశా వ‌ర్క‌ర్ల‌కు శుభ‌వార్తనందించింది. కొవిడ్ స‌మ‌యంలో ఆశా వ‌ర్క‌ర్లు అందించిన సేవ‌ల‌కు గాను ఇన్సెంటివ్‌ల‌ను 30% పెంచింది. ఈమేర‌కు రాష్ట్ర ప్ర‌భుత్వం నెల‌వారీ ప్రోత్సాహ‌కాల‌ను పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో వారి నెల‌వారీ ప్రోత్సాహ‌కాలు రూ.7,500నుండి రూ.9750కి పెర‌గ‌నున్నాయి.ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ‌, నేష‌న‌ల్ హెల్త్ మిష‌న్ కింద ప‌నిచేస్తున్న ఆశా వ‌ర్క‌ర్ల‌కు ఇది వ‌ర్తిస్తుంద‌ని తెలియ‌జేసింది. పెంచిన ఇన్సెంటివ్ గ‌తేడాది జూన్ నుండి వ‌ర్తిస్తాయ‌ని పేర్క‌న్నది.

Leave A Reply

Your email address will not be published.