Pak: బ‌స్సు- ట్ర‌క్కు ఢీకొని 30 మంది మృతి

క‌రాచీ (CLiC2NEWS): పాకిస్థాన్‌లో ఘోర రో్డ్డు ప్ర‌మాదం జ‌రిగింది. బ‌స్సు, ట్ర‌క్కు ఢీకొన్న ఘ‌ట‌న‌లో 30 మంది మృతి చెందారు. మ‌రో 40 మంది తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. పంజాబ్ ప్రావిన్స్‌లోని డేరా ఘాజీకాన్ జిల్లాలో ఈ ప్ర‌మాదం చోటుచేసుకుంది. మృతుల్లో మ‌హిళ‌లు, చిన్నారులు కూడా ఉన్నారు. బ‌క్రీద్ పండుగ సంద‌ర్భంగా సుమారు 70మందికి పైగా కార్మికులు సియాల్‌కోట్ నుంచి రాజ‌న్‌పూర్‌కు వెళ్తున్న బ‌స్సు ఇండ‌స్ హైవేపై థౌన్సా ట్రైపాస్ వ‌ద్ద ట్ర‌క్కును ఢీ కొట్టింది. మృతుల్లో అధికంగా కార్మికులే ఉన్న‌ట్లు అధికారులు తెలిపారు. ఈ ప్ర‌మాదంలో 30 మంది అక్క‌డిక‌క్క‌డే మృతి చెందగా 40 మంది తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. గాయ‌ప‌డిన వారిని స్థానిక ఆసుప‌త్రికి త‌ర‌లించారు. ఈ ప్ర‌మాదంలో 30 మంది మ‌ర‌ణించిన‌ట్లు పాక్ స‌మాచార ప్ర‌సారాల శాఖ మంత్రి ప్ర‌వాద్ చౌదురి వెల్ల‌డించారు. ఇక చికిత్స‌పొందుతున్న వారిలో న‌లుగురి ప‌రిస్థితి విష‌మంగా ఉన్న‌ట్టు ఆసుప‌త్రి వ‌ర్గాలు చెబుతున్నాయి. ఈ ప్ర‌మాదంపై పంజాబ్ ప్రావిన్స్ సిఎం ఉస్మాన్ బుజ్జ‌ర్ దిగ్భ్రాంతి వ్య‌క్తం చేశారు.

Leave A Reply

Your email address will not be published.