ఛత్తీస్‌గఢ్‌లో 30 మంది మావోయిస్టుల మృతి
దంతెవాడ (CLiC2NEWS): ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్ చోటుచేసుకుంది. ఈ ఎన్‌కౌంటర్‌లో 30 మంది మావోయిస్టులు మృతి చెందినట్లు సమాచారం. బస్తర్ రేంజ్‌లోని నారాయణ్‌పుర్-దంతెవాడ జిల్లాల సరిహద్దుల్లో ఉండే అబూజ్‌మాడ్ దండకారణ్యంలో తుల్‌తులి, నెందూర్ గ్రామాల మధ్య శుక్రవారం ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో ఇప్పటివరకు మావోయిస్టుల సంఖ్య 30కి చేరినట్లు పోలీసులు వెల్లడించారు.
మావోయిస్టులు ఉన్నారన్న సమాచారంతో ఆపరేషన్ చేపట్టారు. ఈ ఆపరేషన్లో డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్ (డిఆర్‌జి) , స్పెషల్ టాస్క్‌ఫోర్స్ సిబ్బంది పాల్గొన్నట్లు పేర్కొన్నారు. ఈ ఎన్‌కౌంటర్ అనంతరం 30 మంది మావోయిస్టుల మృతదేహాలతో పాటు ఎకె47 రైఫిల్, ఇతర ఆయుధాలు అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు బస్తర్ ప్రాంతంలో 180 మందికి పైగా మావోయిస్టులు మృతి చెందినట్లు సమాచారం.