Tirumala: జూలై 28 నుంచి ఆగస్టు 30 వరకు రోజుకు 3వేల టికెట్లు
తిరుమల (CLiC2NEWS): కలియుగప్రత్యక్ష దైవం శ్రీవారి దర్శన టికెట్ల కోటాను తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) పెంచింది. కరోనా సెకండ్‌వేవ్ నేపథ్యంలో మార్చి నుంచి 5 వేల టికెట్లు మాత్రమే కేటాయించింది. ఉచిత దర్శనాలు పూర్తిగా నిలిపివేసింది. ప్రస్తుతం కరోనావ్యాప్తి తగ్గడంతో బుధవారం నుంచి రోజుకు 3 వేల చొప్పున ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను టీటీడీ జారీ చేస్తున్నది. ఈ నెల 28 నుంచి ఆగస్టు 30 వరకు రోజూ మూడు వేల టికెట్లకు పెంచడంతో దాదాపు లక్షా పది వేల టికెట్లు భక్తులకు అందుబాటులోకి వచ్చాయి.