ఎయిర్ పోర్ట్ అథారిటిలో 309 జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు..

ఎయిర్ పోర్ట్ అథారిటి ఆఫ్ ఇండియా (ఎఎఐ) .. జూనియర్ ఎగ్జిక్యూటివ్ ( ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్) పోస్టులను భర్తీ చేసేందుకు దరఖాస్తులు కోరుతోంది. దరఖాస్తులను మే నెల 24వ తేదీ లోపు పంపించాల్సి ఉంది.
బిఇ/ బిటెక్/ బిఎస్‌సి (ఇంజినీరింగ్) లేదా ఫిజిక్స్ , మ్యాథమెటిక్స్, సబ్జెక్టులతో బిఎస్‌సి పూర్తి చేసి ఉండాలి. ఇంటర్మీడియట్ స్థాయిలో ఇంగ్లిష్ ఒక సబ్జెక్టుగా చదివుండాలి. ఇంగ్లిష్ మాట్లాడటం, రాయడంలో నైపుణ్యం ఉండాలి.
అభ్యర్థుల వయస్సు మే 24వ తేదీ నాటికి 27 ఏళ్లు ఉండాలి. ఒబిసిలకు మూడేళ్లు, ఎస్‌సి , ఎస్‌టిలకు ఐదేళ్లు
, దివ్యాంగులకు పదేళ్లు, మాజి సైనికోద్యోగులకు ఐదేళ్లు , డిపార్ట్‌మెంటల్ ఉద్యోగులకు పదేళ్ల సడలింపు ఉంటుంది.
మొత్తం పోస్టలు 309
వీటిలో అన్‌రిజర్వ్‌డ్ పోస్టులు-125
ఇడబ్ల్యుఎస్‌లకు 30
ఒబిసి (ఎన్‌సిఎల్) 72
ఎస్‌సిలకు 55
ఎస్‌టిలకు 27 కలవు.
ఈ పోస్టులకు ఎంపికైన వారికి నెలకు వేతనం రూ.40వేల నుండి రూ.లక్ష 40 వేల వరకు అందుతుంది.
రాత పరీక్ష ఆధారంగా అభ్యర్థుల ఎంపిక జరుగుతుంది.
కంప్యూటర్ ఆధారిత పరీక్ష(CBT) నిర్వహిస్తారు. నెగటివ్ మార్క్స్ ఉండవు.
దరఖాస్తులను ఆన్‌లైన్‌లో పంపించాలి. దరఖాస్తు ఫీజు రూ.1000 గా నిర్ణయించారు. ఎస్‌సి , ఎస్‌టి, మాజి సైనికోద్యోగులకు ఫీజు లేదు.