Hyderabad: మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖలో 31 పోస్టులు
హైదరాబాద్ (CLiC2NEWS): జిల్లాలో మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖలో మొత్తం 31 పోస్టులు కాంట్రాక్ట్ ప్రాతిపదికన భర్తీ చేయనున్నారు. ఎస్ ఎస్సి, ఇంటర్, డిగ్రీ, పిజి, పిజిడిప్లొమా చేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. డిసెంబర్ 29వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆఫ్లైన్ దరఖాస్తులను జిల్లా సంక్షేమ అధికారి కార్యాలయం, మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ, 4వ అంతస్తు, స్నేహ సిల్వర్ జూబ్లీ భవన్, కలెక్టరేట్ లక్డీకాపూల్, హైదరాబాద్ చిరునామాకు పంపించాలి.