AP: 3393 మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్ పోస్టులు
అమరావతి (CLiC2NEWS) : ఆంధ్రప్రదేశ్‌లో ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ ఒప్పంద ప్రాతిపదికన మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి బిఎస్సి నర్సింగ్, కమ్యూనిటీ హెల్త్ సర్టిఫికెట్ ప్రోగ్రామ్ పూర్తిచేసి ఉండాలి. ఎపి నర్సింగ్ కౌన్సిల్లో రిజిస్టరయి ఉండాలి. వయసు 35 సంవత్సరాలు మించకూడదు. బిసి/ఎస‌్సి ఎస్టి అభ్యర్థులకు 5ఎఏళ్లు సడలింపు ఉంది. మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్ పోస్టులకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. దరఖాస్తులకు గడువు తేది 06.11.2021గా నిర్ణయించారు. అకడమిక్ మార్కుల మెరిట్ ఆధారంగా తుది ఎంపిక జరుగుతుంది. పూర్తివివరాలకు https://cfw.ap.nic.in/MLHP2021.html వెబ్‌సైట్ చూడగలరు.
జిల్లాల వారీగా ఉన్న పోస్టులు
శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం 633
ఈస్ట్ గోదావరి, వెస్ట్‌గోదావరి, కృష్ణా 1,003
గుంటూరు, ప్రకాశం, నెల్లూరు 786
చిత్తూరు, కడప, అనంతపూర్, కర్నూలు 971