అగ్నిప‌థ్ తొలిబ్యాచ్ శిక్ష‌ణ‌కు 3,474 మంది అభ్య‌ర్థులు..

విశాఖ (CLiC2NEWS): అగ్నిప‌థ్ తొలి బ్యాచ్ ట్రైనింగ్ కొర‌కు 3,474 మంది అభ్య‌ర్థులు ఎంపిక‌య్యార‌ని ఇఎన్‌సి వైస్ అడ్మిర‌ల్ బిశ్వ‌జిత్‌దాస్ గుప్తా తెలియ‌జేశారు. వీరిలో 10% మంది మ‌హిళా అభ్య‌ర్థులు కూడా ఉన్నార‌న్నారు. వీరికి శిక్ష‌ణ పూర్త‌య్యాక తుది జాబితా విడుద‌ల చేస్తామ‌ని.. ఎంపికైన విద్యార్థులంతా వ‌చ్చే మార్చినాటికి విధుల్లో చేర‌తాని వెల్ల‌డించారు.

కేంద్ర ప్ర‌భుత్వం నూత‌నంగా తీసుకొచ్చిన అగ్నిప‌థ్‌ ప‌థకం ద్వారా సైనికుల‌ను నాలుగేళ్ల పాటు సైన్యంలో ప‌నిచేస్తారు. వీరిని అగ్నివీరులు అంటారు. వారి ప‌నితీరును స‌మీక్షించి.. వీరిలో 25% మందిని రెగ్యుల‌ర్ చేస్తారు. వీరు 15 సంవ‌త్స‌రాల పాటు నాన్ ఆఫీస‌ర్ హోదాలో ప‌నిచేస్తారు.

Leave A Reply

Your email address will not be published.