సాయుధ దళాల్లో 357 అసిస్టెంట్ కమాండెంట్ పోస్టులు

డిగ్రీ అర్హతతో అసిస్టెంట్ కమాండెంట్ ఉద్యోగాలు పొందవచ్చు. రాత పరీక్ష, ఫిజికల్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా బోర్డర్ సెక్యూరిటి ఫోర్స్ (బిఎస్ ఎఫ్). సెంట్రల్ రిజర్వ్‌డ్ పోలీస్ ఫోర్స్ (సిఆర్‌పిఎఫ్), సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటి ఫోర్సు (సిఐఎస్ ఎఫ్), ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ (ఐటిబిపి), సశస్త్ర సీమా బల్ (ఎస్ఎస్‌బి) లలో గ్రూప్-ఎ గెజిటెడ్ ఆఫీసర్ హోదా పోస్టులకు ఎంపిక కావచ్చు.
మొత్తం 357 పోస్టులు కలవు.
బిఎస్ ఎఫ్ -24
సిఆర్‌పిఎఫ్ -204
సిఐఎస్ ఎఫ్ – 92
ఐటిబిపి -4,
ఎస్ ఎస్‌బి -33
డిఎస్‌పి, ఎసిపితో సమాన హోదా ఉన్న ఈ పోస్టులకు ఎంపికైన వారికి లెవెల్ -10 రూ. 56,100 జీతం అందుతుంది. మూల వేతనంతో పాటు డిఎ, హెచ్ ఆర్ ఎ, అవెన్సులతో పాటు మొదటి నెల నుండే రూ. లక్ష కంటే ఎక్కువ జీతం అందుతుంది. పదోన్నతులు కూడా పొందవచ్చు. పనిచేస్తున్న విభాగానికి ప్రధానాధికారి కావచ్చు.
దరఖాస్తులను మార్చి 25 లోపు పంపిచాల్సి ఉంది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు ఆగస్టు 1,2025 నాటికి 20-25 ఏళ్ల మధ్య ఉండాలి. ఆగస్టు 2, 2000 నుండి ఆగస్టు 1, 2005 మధ్య జన్మించిన వారు అర్హులు. ఎస్, ఎస్‌టిలకు ఐదేళ్లు, ఒబిసిలకు మూడేళ్ల గరిష్ట వయసులో సడలింపులు వర్తిస్తాయి.
దరఖాస్తు ఫీజు రూ.200గా నిర్ణయించారు. మహిళలకు, ఎస్‌సి, ఎస్‌టిలకు ఫీజు లేదు.
ఆగస్టు 3వ తేదీన పరీక్ష నిర్వహిస్తారు. తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్, విశాఖపట్నం, తిరుపతిలలో పరీక్షలు నిర్వహిస్తారు. అభ్యర్థులు పూర్తి వివరాలకు https://upsc.gov.in/ వెబ్‌సైట్ చూడగలరు.