బిఎస్ఎఫ్‌లో 3,588 కానిస్టేబుల్ పోస్టులు
BSF: బోర్డర్ సెక్యూరిటి ఫోర్స్ (బిఎస్ఎఫ్)లో కానిస్టేబుల్/ ట్రేడ్స్‌మెన్ పోస్టులను భర్తీ చేయనున్నారు. మొత్తం 3,588 పోస్టులు కలవు. వీటిలో పురుషులకు 3,406 పోస్టులు ఉండగా.. మహిళలకు 182 పోస్టులు ఉన్నాయి. పదో తరగతి ఉత్తీర్ణులై, సంబంధిత ట్రేడ్‌లో ఏదైనా ఐటిఐ నుండి 2 ఏళ్ల సర్టిఫికెట్ కోర్సు చేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తులను ఆగస్టు 23వ తేదీ లోపు పంపించాల్సి ఉంది. దరఖాస్తు ఫీజు రూ. 150గా నిర్ణయించారు. ఎస్‌సి, ఎస్‌టి, మహిళలకు ఫీజు లేదు.

వయస్సు 24.08.2025 నాటికి 18 నుండి 25 ఏళ్ల మధ్యన ఉండాలి. ఎస్‌సి, ఎస్‌టిలకు 5 ఏళ్లు, ఒబిసిలకు 3 ఏళ్ల సడలింపు వర్తిస్తుంది.
ఎంపిక ఫిజికల్ స్టాండర్స్ టెస్ట్, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, ట్రేడ్ టెస్ట్ , రాత పరీక్ష , డీటెయిల్డ్ ఎగ్జామినేషన్, రివ్యూ మెడికల్ ఎగ్జామినేషతో ఎంపిక జరుగుతుంది.
అభ్యర్థులు పురుషులైతే ఎత్తు కనీసం 165 సెం.మీ ఉండాలి. ఛాతీ 75-80 సెం. మీ.
మహిళాభ్యర్థులైతే ఎత్తు 155 సెం.మీ ఉండాలి.
ఎంపికైన వారికి నెలకు వేతనం రూ. 21,700 నుండి రూ.69,100 వరకు ఉంటుంది.
పరీక్ష తేదీ , సమయం, పరీక్ష కేంద్రాలు, సిలబస్ తదితర పూర్తి వివరాలకు వెబ్‌సైట్ https://rectt.bsf.gov.in/ చూడగలరు.
[…] […]
[…] […]