36 లక్షలు దాటిన కరోనా పరీక్షలు

అమరావతి : ఏపిలో కోరోనా జోరు కొన‌సాగుతోంది. గత 24 గంటల్లో 62,024 మందికి కరోనా వైరస్‌ పరీక్షలు చేయగా 10,548 మందికి పాజిటివ్ నిర్ధార‌ణ అయిన‌ట్లు అధికారులు తెలిపారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,14,164కు చేరింది. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ శనివారం కరోనాపై హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది. కరోనా నుంచి కోలుకుని నిన్న ఒక్కరోజే 8,976 మంది డిశ్చార్జ్‌ అవ్వగా, ఇప్పటివరకూ మొత్తం 3,12,687 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో కరోనా బారిన పడి 82 మంది మృతి చెందారు. ప్రస్తుతం రాష్ట్రంలో 97,681 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. ఇప్పటివరకూ 36,03,345 మందికి కరోనా పరీక్షలు చేశారు.
తాజాగా చిత్తూరు జిల్లాలో 15 మంది, నెల్లూరు జిల్లాలో 11 మంది, తూర్పుగోదావ‌రి, ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లాల్లో 8మంది చొప్పున‌, అనంత‌పురం, గుంటూరు, క‌ర్నూలు జిల్లాల్లో ఆరుగురు, ప్ర‌కాశం, విశాఖ‌ప‌ట్నం జిల్లాల్లో ఐదుగురు, శ్రీ‌కాకుళం, విజ‌య‌న‌గ‌రం జిల్లాల్లో న‌లుగురు, క‌డ‌ప‌, కృష్ణా జిల్లాల్లో ఇద్దరు చొప్పున ప్రాణాలు కోల్పోయారు.

 

 

Leave A Reply

Your email address will not be published.