ఇంటిలిజెన్స్ బ్యూరోలో భారీగా ఉద్యోగాలు

 

భార‌త ప్ర‌భుత్వ హోం మంత్రిత్వ శాఖ ప‌రిధిలోని ఇంట‌లిజెన్స్ బ్యూరో (ఐబి)లో 3717 అసిస్టెంట్ సెంట్ర‌ల్ ఇంట‌లిజెన్స్ ఆఫీస‌ర్ గ్రేడ్‌- / ఎగ్జిక్యూటివ్ పోస్టులు క‌ల‌వు. వీటి నియామ‌కాల ద్వాఆ గ్రూప్ -సి (నాన్ గెజిటెడ్‌, నాన్ మినిస్ట్రియ‌ల్ ) స‌ర్వీస్ పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నుంది. ద‌ర‌ఖాస్తుల‌ను జులై 19వ తేదీ నుండి స్వీక‌రిస్తున్నారు.

గుర్తింపు పొందిన విశ్వ‌విద్యాల‌యం నుండి గ్రాడ్యుయేష‌న్ ఉత్తీర్ణులైన వారు ఈ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తుల‌ను ఆగ‌స్టు 10వ తేదీ లోపు పంపిచాల్సి ఉంది. ద‌ర‌ఖాస్తు ఫీజు రూ. 100. ప్రాసెసింగ్ పీజు రూ. 550గా నిర్ణ‌యించారు. ఎస్ సి, ఎస్ టి , మ‌హిళా అభ్య‌ర్థుల‌కు ఫీజు లేదు.

అభ్య‌ర్థుల వ‌య‌స్సు 10.08.2025 నాటికి 18 నుండి 27 సంవ‌త్స‌రాల మ‌ధ్య ఉండాలి.

టైర్-1, టైర్ -2 , ఇంట‌ర్వ్యూ ఆధారంగా ఎంపిక జ‌రుగుతుంది.

ఎంపికైన వారికి నెల‌కు వేత‌నం.. రూ.44,900 నుండి రూ.1,42,400 మ‌రియు ఇత‌ర అల‌వెన్సులు ఉంటాయి.

తిరుప‌తి, నెల్లూరు, క‌ర్నూలు, క‌డ‌ప‌, అనంత‌పురం, విజ‌య‌న‌గ‌రం, విశ‌ఖ‌ప‌ట్నం, కాకినాడ‌, రాజ‌మ‌హేంద్ర‌వ‌రం, గుంటూరు విజ‌య‌వాడ‌, హైద‌రాబాద్‌, సికింద్రాబాద్‌, క‌రీంన‌గ‌ర్,వ‌రంగ‌ల్‌, మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ , ఖ‌మ్మంలో ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తారు.

టైర్‌- 1 ప‌రీక్ష ..

100 మార్కుల అబ్జెక్టివ్ ప్ర‌శ్న‌లుంటాయి.
ప‌రీక్ష వ్య‌వ‌ధి 60 నిమిషాలు..

ప్ర‌తి త‌ప్పు స‌మాధానికి 0.25 నెగ‌టివ్ మార్కులు ఉంటాయి.

స‌బ్జెక్టులు..

క‌రెంట్ ఆఫైర్స్‌,
జ‌న‌ర‌ల్ స్ట‌డీస్,
న్యూమ‌రిక‌ల్ అప్టిట్యూడ్,
లాజిక‌ల్ రీజ‌నింగ్‌,
ఇంగ్లిష్

టైర్ -2 పరీక్ష‌..

50 మార్కుల డిస్క్రిప్ష‌న్ టైప్ పేప‌ర్‌..
ప‌రీక్ష వ్య‌వ‌ధి 60 నిమిషాలు..

ఎస్సేకి 20 మార్క్స్ (20)

ఇంగ్లిష్ కాంప్ర‌హెన్ష‌న్ 10 మార్క్స్‌(10)

రెండు లాంగ్ ఆన్స‌ర్ టైప్ ప్ర‌శ్న‌ల‌కు 10 మార్క్స్‌(20)

ఇంట‌ర్వ్యూకు 100 మార్కులు ఉంటాయి.

 

Leave A Reply

Your email address will not be published.