TS: 38 క‌స్తూర్భా గాంధీ బాలికా విద్యాల‌యాలు ఇంట‌ర్‌ వ‌ర‌కు అప్‌గ్రేడ్‌..

హైద‌రాబాద్ (CLiC2NEWS): రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 38 క‌స్తూర్భా గాంధీ బాలికా విద్యాల‌యాల‌ను ఇంట‌ర్మీడియ‌ట్ వ‌ర‌క అప్‌గ్రేడ్ చేయ‌నున్న‌ట్లు విద్యాశాఖ మంత్రి స‌బితా ఇంద్రారెడ్డి తెలిపారు. వీటిలో ఈ విద్యా సంవ‌త్స‌రం (2023-24) ఇంట‌ర్ ప్ర‌థ‌మ సంవ‌త్స‌రం, 2024-25 లో ద్వితీయ సంవ‌త్స‌రం త‌ర‌గ‌తులు ప్రారంభ‌మ‌వుతాయి. తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 475 కెజిబివిలు ఉన్నాయి. అయితే ఇప్ప‌టివ‌ర‌కు 245 విద్యాల‌యాల‌ను ఇంట‌ర్మీడియ‌ట్ వ‌ర‌కు ప్ర‌భుత్వం అప్‌గ్రేడ్ చేసింది. ప్ర‌స్తుతం 38 విద్యాల‌యాల‌ను అప్ గ్రేడ్ చేయ‌నున్నారు.

ఈ నిర్ణ‌యంతో ప్ర‌భుత్వంపై ప్ర‌తి ఏటా రూ. 7.60 కోట్ల భారం ప‌డుతుంద‌ని తెలిపారు. మొత్తం 475 విద్యాల‌యాల‌లో 1,33,879 మంది విద్యార్థులు చ‌దువుతున్న‌ట్లు మంత్రి వెల్ల‌డించారు.

Leave A Reply

Your email address will not be published.