తెలుగమ్మాయికి తొలి ప్రయత్నంలోనే సివిల్స్‌లో 3వ ర్యాంకు..

మహబూబ్‌నగర్ (CLiC2NEWS): యుపిఎస్సి విడుదల చేసిన సివిల్స్ తుది ఫలితాలలో తెలంగాణకు చెందిన అమ్మాయికి 3వ ర్యాంకు వచ్చింది. మహబూబ్‌నగర్‌కు చెందిన అనన్య రెడ్డి తొలి ప్రయత్నంలోనే ర్యాంకు సాధించింది. ఎటువంటి కోచింగ్ తీసుకోకుండా తన స్వంత ప్రణాళికతో సివిల్స్‌లో 3వ ర్యాంకులో నిలవడమనేది నిజంగా గొప్ప విషయం. పదో తరగతి వరకు మహబూబ్‌నగర్ గీతం హైస్కూల్లో చదివిన అనన్య.. ఇంటర్ హైదరాబాద్‌లో, డిగ్రీ ఢిల్లీలోని మెరిండా హౌస్ కాలేజీలో చదివింది. ఇంటర్వూ తర్వాత సివిల్స్‌కు ఎంపికవుతానని భావించినప్పటికి.. మూడో ర్యాంకు వస్తుందని అనుకోదని ఆమె తెలిపింది. చిన్నప్పటి నుండి సమాజానికి సేవ చేయాలన్న కోరికతోనే సివిల్స్‌ను ఎంచుకున్నట్లు తెలిపారు