4 దశల్లో పచాయతి ఎన్నికలు
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్

అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. ఎన్నికల నిర్వహణకు ఆ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఇవాళ ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రంలో నాలుగు దశల్లో ఎన్నికలు నిర్వహించనున్నట్లు పేర్కొంది. ఈ నెల 23న తొలిదశ ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు వెల్లడించింది. 27న రెండో దశ, 31న మూడో దశ, ఫిబ్రవరి 4న నాలుగోదశ ఎన్నికలకు నోటిఫికేషన్ ఇవ్వనున్నట్లు తెలిపింది. ఫిబ్రవరి 5న తొలిదశ, 9న రెండో దశ, 13 మూడో దశ, 17న నాలుగో దశ ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఈసీ నిమ్మగడ్డ రమేశ్ స్పష్టం చేశారు. రేపటి నుంచే రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమలులోకి రానుందని చెప్పారు. ఉదయం 6.30 గంటల నుంచి మధ్యాహ్నం 3.30 గంటల వరకు పోలింగ్ జరగనున్నట్లు షెడ్యూల్‌లో పేర్కొన్నారు. పోలింగ్ జరిగిన రోజు సాయంత్రం 4 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుందని చెప్పారు.